ఈక్వెడార్ జైళ్లలో ఘర్షణల(ecuador prison riots) పరంపర కొనసాగుతోంది. గాయస్ రాష్ట్రం, గాయక్విల్ నగరంలోని ఓ కారాగారంలో మంగళవారం రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో(Guayaquil prison riot) మృతుల సంఖ్య 116కు చేరింది. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ గ్యాంగ్‌వార్‌లో ఖైదీలు తుపాకులు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవటం, పేలుళ్లకూ పాల్పడటం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దాడిలో ఉపయోగించిన తుపాకి, ఫోన్లు జైళ్లలో ఎమర్జెన్సీ..
జైళ్లలో ఘర్షణలు తలెత్తి(Prison riot 2021) పదుల సంఖ్యలో ఖైదీలు ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ఈక్వెడార్ కారాగారాల్లో అత్యవసర స్థితి విధించారు అధ్యక్షుడు గులెర్మో లాసో. కారాగారాల్లో అదనపు బలగాలను మోహరించటం, మరిన్ని అధికారాలను కల్పించేందుకు ప్రభుత్వానికి అనుమతించారు. గాయక్విల్ ఘటన బాధాకరమని, క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య అధికారం కోసం జరిగే వివాదాలకు జైళ్లు కేంద్రంగా మారటం విచారకరమని తెలిపారు. పరిస్థితులను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
జైలులో తనిఖీలు చేస్తున్న పోలీసులు జైలు గదుల్లో తనిఖీ చేస్తున్న పోలీసులు గాయక్విల్ కారాగారంలో ఘర్షణ తలెత్తి పదుల సంఖ్య ఖైదీలు మరణించినట్లు తెలిసిన క్రమంలో.. తమ వారి కోసం జైలు ముందు బారులు తీరారు బంధువులు, కుటుంబ సభ్యులు. తమ వారిని చూసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు.
ఇదీ చూడండి:జైలులో గ్యాంగ్ వార్.. 24 మంది ఖైదీలు మృతి!