పదేళ్ల చిన్నారి పర్వతారోహణ.. అరుదైన ఘనత అమెరికాలోని 10 ఏళ్ల కొలరాడో చిన్నారి సెలా స్కెనీటర్ యోస్మిటీ జాతీయ పార్కులో ఉన్న 'ఈఐ క్యాపిటన్' పర్వతాన్ని అధిరోహించింది. పర్వతారోహణకు అత్యంత సవాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా పేరు సంపాదించింది ఈ చిన్నారి.
తన తండ్రి మైక్ స్కెనీటర్, కుటుంబ సన్నిహితుడు మార్క్ రెగియర్ల సహాయంతో 3000 అడుగుల (910 మీటర్ల) ఎత్తు ఉన్న 'ఈఐ క్యాపిటన్' పర్వతాన్ని అధిరోహించింది స్కెలా.
అనువుగా ఉండే దారిలో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ ముగ్గురు జూన్ 12న శిఖరానికి చేరారు. సాధారణంగా ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులకు 4-5 రోజుల సమయం పడుతుందని అక్కడి నిపుణులు అంటున్నారు.
"ఈ పర్వతం విజయవంతంగా అధిరోహించినందుకు సంతోషంగా ఉంది. భావోధ్వేగానికి లోనవుతున్నాను. అప్పుడే ఈ ప్రయాణం పూర్తయిందనే చిన్న బాధ కూడా ఉంది."
- సెలా స్కెనీటర్, పర్వతాన్ని అధిరోహించిన చిన్నారి
ఇదీ చూడండి: అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్