తెలంగాణ

telangana

By

Published : Aug 1, 2020, 8:30 AM IST

ETV Bharat / international

అమెరికాలో 70 వేల కేసులు- వియత్నాంలో తొలి మరణం

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉద్ధృతంగా విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1.77 కోట్ల మందికి వైరస్ సోకిగా 6.82 లక్షలమంది మృత్యువాత పడ్డారు.

wolrd corona tracker
కరోనా మహమ్మారి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 1.77 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి 6,82,885 మంది మృతిచెందారు.

అగ్రరాజ్యంలో..

అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,904 కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 47.05 లక్షలకు చేరింది. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 1,56,747 మంది మృత్యువాతపడ్డారు.

50 వేల కేసులు..

బ్రెజిల్​లోనూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 52 వేల మందికిపైగా వైరస్ బారిన పడగా మొత్తం బాధితుల సంఖ్య 26.66 లక్షలకు పెరిగింది. 92 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

మూడో స్థానంలో మెక్సికో..

మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య భారీగా ఉంది. 46,688 మరణాలతో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో ఉంది. కేసుల సంఖ్య పరంగా ఆరో స్థానంలో ఉంది మెక్సికో. ఇప్పటివరకు ఆ దేశంలో 4.16 లక్షల కేసులు నమోదయ్యాయి.

రష్యాలో స్థిరంగా..

రష్యాలో వైరస్ ఉద్ధృతి తగ్గినా స్థిరంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 5,482 మందికి కరోనా నిర్ధరణ అయింది. దేశంలో మొత్తం బాధితులు 8.39 లక్షల మంది ఉన్నారు. రష్యాలో మరణాల రేటు కూడా అదుపులో ఉంది. ఇప్పటివరకు 13,963 మంది మరణించారు.

భారీగా పెరుగుదల..

దక్షిణాఫ్రికాలో క్రమంగా కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా 11,014 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4.93 లక్షలుగా ఉంది.

వియత్నాంలో తొలి మరణం..

కరోనా కట్టడి చేయడంలో విజయంతమై ప్రపంచ దేశాల మన్ననలను పొందిన వియత్నాంలో 100 రోజుల తర్వాత కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ కమ్యూనిస్టు దేశంలో శుక్రవారం తొలి కరోనా మరణం నమోదైంది. హుయీ‌ నగరంలో 70 ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఒక్కరోజే దనాంగ్‌లో 45 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

మళ్లీ విజృంభణ..

పెరూ, చిలీ, కొలంబియా, సౌదీ, బంగ్లాదేశ్, అర్జెంటీనా, ఫిలిప్పీన్స్​ దేశాల్లో వైరస్​ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్పెయిన్​, ఇరాన్​, జపాన్​లోనూ మళ్లీ వైరస్ విజృంభిస్తోంది.

దేశం మొత్తం కేసులు మృతులు కోలుకున్నవారు
అమెరికా 47,05,889 1,56,747 23,27,572
బ్రెజిల్ 26,66,298 92,568 18,84,051
రష్యా 8,39,981 13,963 6,38,410
దక్షిణాఫ్రికా 4,93,183 8,005 3,26,171
మెక్సికో 4,16,179 46,000 2,72,187
పెరూ 4,07,492 19,021 2,83,915
చిలీ 3,55,667 9,457 3,28,327

ఇదీ చూడండి:కరోనా సోకిన తొలి పెంపుడు శునకం మృతి

ABOUT THE AUTHOR

...view details