తెలంగాణ

telangana

ETV Bharat / international

వరదలకు ఆసియాలో 600 మంది మృతి :ఐరాస - మయన్మార్​

ఆసియాలోని పలు దేశాల్లో కుండపోత వర్షాలతో సుమారు 600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) వెల్లడించింది. భారత్​, బంగ్లాదేశ్​, నేపాల్​, మయన్మార్​లలో దాదాపు 2.5 కోట్ల మంది వరదలకు ప్రభావితమయ్యారని పేర్కొంది.

వరదలకు 600 మంది మృతి :ఐరాస

By

Published : Jul 28, 2019, 5:24 AM IST

Updated : Jul 28, 2019, 11:20 AM IST

వరదలకు 600 మంది మృతి :ఐరాస

భారీ వర్షాలు ఆసియా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారత్​, బంగ్లాదేశ్​, నేపాల్​, మయన్మార్​లలో ఇప్పటివరకు 600 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దేశాల్లో దాదాపు 2.5 కోట్ల మంది వరదల బారిన పడ్డారని ఐరాస అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అన్నారు.

వరదల ప్రభావం ఉన్న భారత్‌లో ఇప్పటికే యూనిసెఫ్‌ సహకారం అందిస్తోందని తెలిపారు ఫర్హాన్​. అసోం, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని వెల్లడించారు. వరదల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీరు, ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

భారత్​లో కోటి మందికిపైగా...

భారత్​లోని అసోం, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లోనే సుమారు కోటి మందికిపైగా వరదల ప్రభావానికి గురయ్యారని చెప్పారు ఫర్హాన్​. ఒక్క అసోంలోనే దాదాపు 2 వేల పాఠశాలలు దెబ్బతిన్నాయన్నారు. భారత్‌లో ఓ వైపు వరదలు ముంచెత్తుతుండగా, మరోవైపు ఎండలు మండుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.

93 మంది చిన్నారులు...

వరదల కారణంగా భారత్​, నేపాల్​, బంగ్లాదేశ్​లలో సుమారు 93 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఐరాస చిన్నారుల విభాగం యూనిసెఫ్​ (యూఎన్​ఐసీఈఎఫ్​) వెల్లడించింది. లక్షల మంది చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. అంటువ్యాధులు సోకకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ఉత్తర ఫిలిప్పీన్స్​లో వరుస భూకంపాలు

Last Updated : Jul 28, 2019, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details