తెలంగాణ

telangana

ETV Bharat / international

2050నాటికి 30కోట్ల మంది సముద్రంలో మునిగిపోతారు!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఐరాస సెక్రెటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​​ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టం పెరుగుదలతో విశ్వం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర స్థాయిలో సముద్రమట్టం పెరుగుతున్న దేశాల్లో భారత్​ జపాన్​, చైనా, బంగ్లాదేశ్​ ఉన్నాయని తెలిపారు.

By

Published : Nov 5, 2019, 6:30 AM IST

2050నాటికి 30కోట్ల మంది సముద్రంలో మునిగిపోతారు!

పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర మట్టం పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి​ ఆంటోనియో గుటెరస్​ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు కారణంగా సముద్రమట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న దేశాల జాబితాలో భారత్, జపాన్, చైనా, బంగ్లాదేశ్​ ​ఉన్నాయని తెలిపారు. బ్యాంకాక్​లో నిర్వహించిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన గుటెరస్​​ మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.

300మిలియన్ల మందికి ముంపు ముప్పు

వాతావరణ మార్పుల కారణంగా ఊహించిన దానికంటే సముద్ర మట్టం చాలా వేగంగా పెరుగుతోందని ఓ పరిశోధన కేంద్రం ఇచ్చిన నివేదికను ఆధారంగా చూపారు గుటేరస్​. ఈ పరిస్థితిని తిప్పికొట్టలేకపోతే 2050 నాటికి ప్రపంచంలో 300మిలియన్ల మంది ప్రజలు సమద్రాలు ఉప్పొంగి మునిగిపోతారని వెల్లడించారు. వాతావరణం వేగంగా మార్పు చెందుతోందని, ఇది భూమికి చాలా ప్రమాదకరమని వివరించారు.

శాస్త్రవేత్తల సలహాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, స్థానిక అధికారులపై దృష్టి పెట్టేందుకు ఐరాస కట్టుబడి ఉందని గుటెరస్​ అన్నారు. ఇది సాధ్యం కావాలంటే 2050 నాటికి గాలిలో కార్బన్​ వాయువులను తటస్థంగా ఉంచేలా చూడాలని.. వచ్చే దశాబ్దం నాటికి 45శాతం ఉద్గారాలను తగ్గించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details