ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేందుకు భారత్తో కలిసి పోరాటం చేస్తామని అమెరికా తెలిపింది. ఈ మేరకు 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో నేరస్థులను జవాబుదారీగా ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. నాటి దాడిలో మృతిచెందిన ఆరుగురు అమెరికన్లు సహా.. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ఈ దాడి జరిగి గురువారానికి 12ఏళ్లు పూర్తైన సందర్భంగా.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ.. రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం నిర్వహించింది అగ్రరాజ్యం.
ముంబయి దాడుల నేరస్థులను పాకిస్థాన్ తప్పినిసరిగా శిక్షించాలని డిమాండ్ చేశారు అమెరికాలోని భారత రాయబారి రణధీర్ జైస్వాల్. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు బలమైన సహాయ సహకారాలు అందించాలన్నారు.
ముంబయి బాధితులకు ఇజ్రాయెల్ నివాళులు
26/11 ముంబయి దాడుల బాధితులకు ఇజ్రాయెల్ ప్రజలు నివాళులు అర్పించారు. ఈ దాడికి పాల్పడ్డ నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఖండించారు.