తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి - బాల్టిమోర్ పోలీసులు

అమెరికా మేరీల్యాండ్​లోని ఓ షాపు, గ్యాస్​ స్టోర్​లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

shooting at maryland
షాపులో కాల్పులు-ఇద్దరు మృతి

By

Published : Mar 29, 2021, 7:35 AM IST

Updated : Mar 29, 2021, 8:06 AM IST

అమెరికా మేరీల్యాండ్​లోని ఓ షాపు​ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అయితే.. రాయల్​ ఫార్మ్స్ స్టోర్​లో జరిగిన ఈ కాల్పుల ఘటనకు, 15 నిమిషాల తర్వాత సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​లో జరిగిన మరో కాల్పులకు సంబంధం ఉందా అనే కోణంలో బాల్టిమోర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక మీడియో వెల్లడించింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు అనంతరం రెండు ఘటనలకు సంబంధం ఉందా అనే దానిపై స్పష్టత వస్తుందని బాల్టిమోర్​ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి:కుప్పకూలిన హెలికాప్టర్..​ ఐదుగురు మృతి

Last Updated : Mar 29, 2021, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details