అమెరికాలో పోలీసులు శనివారం జరిపిన వివిధ కాల్పుల్లో ఆరుగురు దుండగులు మృతి చెందారు. కొలంబస్, కాలిఫోర్నియా, మసాచుసెట్స్.. లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఆరుగురు దుండగులు మృతి చెందారు. వీరి నుంచి ఆయుధాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టెన్నెస్సీలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి యత్నించగా పోలీస్ అధికారి.. ఆ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుండగుడు మృతిచెందాడు.
ఐదుగురికి గాయాలు