అమెరికా టెక్సాస్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రియాన్లోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
అయితే.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు బ్రియాన్ పోలీసులు తెలిపారు. దుండగుడు కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత లేదని అన్నారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ పోలీసు అధికారికి బుల్లెట్ తగిలినట్లు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు.