తెలంగాణ

telangana

ETV Bharat / international

3 లక్షల కరోనా కేసులు- 12 వేల మందికిపైగా మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న మరణాలు.. వేలకొద్దీ నమోదవుతున్న వైరస్​ కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 187 దేశాలపై పడగవిప్పిన కరోనా కాటుకు సుమారు 12.5 వేలమంది ప్రాణాలుకోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కూడా భయానకం సృష్టించేలా 3 లక్షలకు మించిపోయింది.

World wide Coronavirus death toll has reached 12.5 thousands
3 లక్షల కరోనా కేసులు- 12 వేల మందికిపైగా మృతి

By

Published : Mar 22, 2020, 5:03 AM IST

Updated : Mar 22, 2020, 9:16 AM IST

3 లక్షల కరోనా కేసులు- 12 వేల మందికిపైగా మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ సోకినవారి సంఖ్య 3 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 12.5 వేలకు చేరింది. ఇటలీలో ఒక్కరోజే 793 మంది మృత్యువాత పడగా.. ఆ దేశంలో ఇప్పటివరకూ అత్యధికంగా 4,825 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రపంచవ్యాప్త మరణాల్లో ఇది 38.3 శాతం.

స్పెయిన్​లో ఒక్కరోజులో 285 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఇరాన్, ఫ్రాన్స్‌లోనూ.. 100 మందికిపైగా మరణించారు. ఆఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. వైరస్​ను అరికట్టే చర్యల్లో భాగంగా ఇప్పటికే అనేక దేశాలు సైన్యాన్ని రంగంలోకి దించి నిర్బంధ చర్యలు ముమ్మరం చేశాయి.

187 దేశాల్లో కరోనా ప్రభావం..

ప్రపంచమహమ్మారి కొవిడ్‌-19.. ఇప్పటివరకూ 187 దేశాలకుపైగా పాకింది. దాదాపు 3 లక్షల మందిని పైగా చుట్టేసిన ఈ వైరస్​.. 4 నెలల వ్యవధిలోనే 13వేల మందికిపైనే బలితీసుకుంది. చైనా తర్వాత.. అంతకుమించి ఇటలీలో ప్రభావం చూపుతున్న కరోనా... ఆ దేశంలో ఒక్కరోజే 793 మంది ఉసురు తీసింది. కరోనా బయటపడిన తర్వాత ఓ దేశంలో ఇంతమంది ఒకేరోజు మృత్యువాతపడడం ఇదే ప్రథమం. ఆ దేశంలో మరో 6,557 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా.. మొత్తం బాధితుల సంఖ్య 53,578కు చేరింది.

ఒక్కరోజులో కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు:

  • స్పెయిన్​లో 285 మంది వైరస్​ ధాటికి బలవ్వగా.. 3,800కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఇరాన్‌లో 123 మంది చనిపోగా.. సుమారు 1,000 వరకు వైరస్​ బారినపడ్డారు.
  • ఫ్రాన్స్‌లో 112 మందిని పొట్టనపెట్టుకొన్న కరోనా.. మరో 1,800 మందికిపైగా సోకింది.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసిన ఫ్రెంచ్ ప్రభుత్వం.. హెలికాప్టర్ అంబులెన్స్‌లు, డ్రోన్ సేవలు వినియోగించనున్నట్లు తెలిపింది.

ఇటలీ తర్వాత అమెరికాలో కరోనా ప్రభావం అధికంగా కనిపించింది.

  • అమెరికాలో ఒక్కరోజులో 4,780 మందికి వైరస్​ సోకగా.. 32 మంది ప్రాణాలు కోల్పాయారు.
  • జర్మనీలో కొత్తగా 2,365కి పైగా కరోనా కేసులు నమోదుకాగా.. 16 మంది బలయ్యారు.
  • ఉత్తరకొరియాలో సుమారు 1,000 మందికి పైగా వైరస్​ బారినపడగా... 50 మందికిపైగా మృతిచెందారు.
  • స్విట్జర్లాండ్​లో 1,050 మందికి సోకిన వైరస్​... 20 మందిని పొట్టనపెట్టుకొంది.
  • నెదర్లాండ్స్‌, బెల్జియంలోనూ 500కి పైగా కేసులు.. 30కి పైగా మరణాలు సంభవించాయి.
  • టర్కీలో 12 మంది, బ్రెజిల్‌లో ఏడుగురు చొప్పున వైరస్​ బారినపడి మరణించారు.
  • పాకిస్థాన్‌లో కొత్తగా మరో 233 మందికి వైరస్​ సోకగా... మొత్తం కేసుల సంఖ్య 734కి చేరింది. ఈ క్రమంలో అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై పాక్ సర్కారు నిషేధం విధించింది.

ఇదీ చదవండి:ఇటలీలో ఆగని కరోనా మరణాలు- ఒక్కరోజులో 793 మంది

Last Updated : Mar 22, 2020, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details