బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను పలు దేశాలు నిషేధించాయి. భద్రతా ప్రమాణాలపై సంస్థ హామీ ఇచ్చినప్పుడే నిషేధం ఎత్తివేస్తామని తేల్చి చెబుతున్నాయి. భారత్ సైతం ఆ విమానాలను నిషేధించే అవకాశం ఉంది.
బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, నార్వే, మలేషియా, ఒమన్ సహా అనేక దేశాలు ఇప్పటికే తమ గగనతలం నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నిషేధించాయి.
ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, అనుమానాలన్నిటికీ సమాధానం లభించే వరకు అన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను జర్మనీలో నిషేధిస్తున్నట్టు ఆ దేశ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని బోయింగ్ విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని చైనా చెప్పింది. ఇథియోపియా ప్రమాదంలో మరణించిన వారికి బ్రిటన్ ఏవియేషన్ సంతాపం తెలిపింది.