ఊబకాయ సమస్య నివారణ, పిల్లల ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పలు సూచనలు చేసింది. ఏడాది సంవత్సరంలోపు చిన్నారులు గ్యాడ్జెట్లకు పూర్తిగా దూరంగా ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక ప్యానెల్ తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లలు రోజులో కేవలం గంట సేపే ఫోన్లు, ట్యాబ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది.
'ఏడాది పిల్లలకు ఫోన్ అసలు ఇవ్వొద్దు' - పిల్లలు
తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా పలు సూచనలు చేసింది. గ్యాడ్జెట్ల వినియోగంపై పరిమితులు ఉండాలని పేర్కొంది. ఊబకాయ సమస్య నివారణకు తగిన వ్యాయామం అవసరమని తెలిపింది.
ఏడాది పిల్లలకు.. ఫోన్ దూరంగా పెట్టాలి'
మరిన్ని అంశాలు...
- మనిషి జీవితంలో తొలి ఐదేళ్లు ఎంతో ముఖ్యం... ఈ ఐదేళ్ల జీవనం మనిషి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది చిన్నారులు ఊబకాయంతో బాధ పడుతున్నారు. వీరిలో సగం మంది ఆఫ్రికా, ఆసియాకు చెందినవారే.
- 3-4 ఏళ్ల చిన్నారులు రోజుకు కనీసం 3 గంటలు వ్యాయామం చేయాలి.
- సరైన వ్యాయామం లేకపోవడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రస్తుతం 23 శాతం పెద్దలు, 80శాతం యువత శారీరకంగా ఉత్సాహంగా ఉండట్లేదు.
ఇదీ చూడండి: భాజపా చరిత్రలో ఈసారే అత్యధిక స్థానాల్లో పోటీ