తెలంగాణ

telangana

ETV Bharat / international

మాలీలో తెగల మధ్య పోరాటం.. 38 మంది మృతి - డాగోను తెగ

ఆఫ్రికా దేశం మాలీలో రెండు గ్రామాలపై దాడి చేసింది ఓ ప్రత్యర్థి వర్గం. ఈ అల్లర్లలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

మాలీలో తెగల మధ్య పోరాటం.. 38మంది మృతి

By

Published : Jun 19, 2019, 7:16 AM IST

Updated : Jun 19, 2019, 7:49 AM IST

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలో జరుగుతున్న వర్గ పోరాటంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 2 గ్రామాల్లోనిడాగోను తెగకు చెందిన వారిపై మరో వర్గం వారు దాడికి దిగారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థి వర్గమైన ఫులానీ కుటుంబీకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

"గత రాత్రి దాడికి గురైన గంగాఫని, యోరో గ్రామాలు బుర్కినా ఫాసోకు అతి సమీపంలో ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం... 38 మంది చనిపోయారు. లెక్కకు మించి క్షతగాత్రులయ్యారు."

-ప్రభుత్వ ప్రకటన

చంపిన అనంతరం మృతదేహాలను కాల్చడం, పంటలను తగులబెట్టడం వంటి క్రూర చర్యలకు పాల్పడినట్టు సమాచారం. ఈ నెల ఆరంభంలోనూ ఇదే తెగకు చెందిన గ్రామంపై దాడి చేసి 35 మందిని చంపారు. ఈ ఏడాది మొదట్లో 160 మంది ఫులానీ వర్గం వారిని ప్రత్యర్థులు చంపేశారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా!

Last Updated : Jun 19, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details