నైజీరియాలో జిహాదీలుగా అనుమానిస్తున్న దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఈశాన్య ప్రాంతంలోని ఓ సైనిక స్థావరంపై వీళ్లు చేసిన దాడిలో 15 మంది సైనికులు మరణించారు. స్థావరం నుంచి ఆయుధాలను దొంగలించిన జిహాదీలు... సమీప పట్టణంలోని దుకాణాలను లూఠీ చేశారని సైన్యాధికారులు తెలిపారు.
"ఇప్పటి వరకు 15 మృతదేహాలను గుర్తించాం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడి చేసిన వారు ఐసిస్ అనుబంధ బోకోహరామ్ ఉగ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ పశ్చిమ ఆఫ్రికా ప్రావిన్స్'కు చెందినవారుగా అనుమానిస్తున్నాం."