దక్షిణాఫ్రికా అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. 48 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి.
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరిగిన ఆరో ఎన్నికల్లో సుమారు 2 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారని స్వతంత్ర ఎన్నికల సంఘం (ఐఈసీ) తెలిపింది. 1994 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే ప్రథమమని వెల్లడించింది. ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.