తెలంగాణ

telangana

ETV Bharat / international

'మిస్టర్​ ప్రధాని... మీ పదవి రద్దు చేసుకోండి' - రాజకీయ సంస్కరణలు

దేశంలో రాజకీయ సంస్కరణలు చేపట్టాలని సెనెగల్ అధ్యక్షుడు నిర్ణయించారు. ఇకపై ప్రధాని పదవి లేకుండా చేయాలని ప్రస్తుత ప్రధానికే సూచించడం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ప్రకటించి, కార్యాచరణ ప్రారంభించడం మరో ప్రత్యేకత.

'మిస్టర్​ ప్రధాని... మీ పదవి రద్దు చేసుకోండి'

By

Published : Apr 7, 2019, 10:03 AM IST

ఆఫ్రికా దేశం సెనెగల్​లో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. దేశాధ్యక్షుడు మాకీ సాల్, పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రధానమంత్రి పదవి రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రధాని మహమ్మద్​ బౌన్ అబ్దుల్లా డియోన్నే స్వయంగా డకార్​లోని అధ్యక్ష భవనం నుంచి ప్రకటించారు.

పాలనను ప్రజలకు చేరువ చేయడమే ఈ సంస్కరణల ముఖ్యోద్దేశమని డియోన్నే తెలిపారు.

ఇటీవలే అధ్యక్షుడు సాల్​ తన అనుయాయుడైన డియోన్నేకు మరోసారి ప్రధాని పదవి కట్టబెట్టారు. తాజాగా ప్రధాని పదవి రద్దు చేయాలని నిర్ణయించడం వల్ల... అధ్యక్ష శాసనం అనుసరించి ఇకపై డియోన్నే సెక్రటరీ జనరల్​ ఆఫ్​ రిపబ్లిక్​గా కొనసాగనున్నారు.

గెలిచిన వారానికే...

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాకీ సాల్​ భారీ విజయం సాధించి, రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించారు. వెంటనే రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details