లిబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రంలో సుమారు 300 మంది లిబియా వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న లిబియా నావికాదళం మునిగిపోతున్న పడవ నుంచి 125 మందిని కాపాడారు.
గల్లంతైనవారి కోసం హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గాలిస్తున్నారు. ఈ 150 మంది మరణించినట్లయితే.. మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో అతి పెద్దది ఇదే అవుతుంది. ఈ ఏడాది మే నెలలో లిబియా నుంచి యూరప్‌కు బయల్దేరిన వలసదారుల ఓ పడవ బోల్తా పడగా 70 మంది మరణించారు. 2018 జనవరిలోనూ 64 మంది వలసదారులు చనిపోయారు.