తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్కెట్లో తెగిపడిన హైఓల్టేజ్​ విద్యుత్తు తీగలు.. 26 మంది మృతి - కాంగో తాజా వార్తలు

Power Cables Collapse Congo: వర్షం కారణంగా మార్కెట్లో హైఓల్టేజ్​ విద్యుత్తు తీగలు తెగిపడి 26 మంది మృతిచెందారు. కాంగోలో జరిగిన ఈ ఘటనలోని మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

High-voltage power cable kills 26 in Congos capital
కరెంటు తీగలు తెగిపడి 26 మంది మృతి

By

Published : Feb 3, 2022, 11:55 AM IST

Power Cables Collapse Congo: కాంగో రాజధాని కిన్షాసాలో ఘోర ప్రమాదం జరిగింది. తుపాను కారణంగా హైఓల్టేజ్​ విద్యుత్తు తీగలు తెగిపడి 26 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళలంతా స్థానిక​ మార్కెట్​లో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

'మేము వర్షం తగ్గేవరకు అక్కడ దగ్గర ఉన్న చర్చికి వెళ్లాము. వాన తగ్గకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రజలు మార్కెట్​కు చేరుకున్నారు. అకస్మాత్తుగా విద్యుత్తు తీగలు తెగిపడి పెద్దగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న ప్రజలను కాపాడమని భగవంతుడిని ప్రార్థించాము. బయటికి వచ్చి చూసేసరికి విగతజీవులై పడి ఉన్నారు' అని స్థానిక విక్రేతలు తెలిపారు.

ప్రధాని విచారం..

ఈ ఘటనపై కాంగో ప్రధాని సమా లూకండే విచారణ వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా మటాడి కిబాలా మార్కెట్​లో విద్యుత్తు ప్రమాదం జరగడం బాధకరమన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధి పాట్రిక్ ముయాయా తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కల్తీ కొకైన్‌ తీసుకుని 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details