తెలంగాణ

telangana

ETV Bharat / international

సోమాలియాలో మారణహోమం.. పేలుడులో 78 మంది మృతి

బాంబు పేలుడుతో సోమాలియా రాజధాని మొగదిషు ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 78 మంది మరణించారు, మరో 125 మంది వరకు గాయపడట్టు సమాచారం. నగరంలోనే అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మృతుల్లో అధికంగా విద్యార్థులే ఉన్నట్టు సమాచారం.

Massive car bomb kills at least 76 in Mogadishu
సోమాలియాలో మారణహోమం.. పేలుడులో 76 మంది మృతి

By

Published : Dec 28, 2019, 4:45 PM IST

Updated : Dec 28, 2019, 8:53 PM IST

సోమాలియాలో మారణహోమం

సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ కారు​ బాంబు పేలుడు ఘటనలో మరో 125 మందికి పైగా క్షతగాత్రులయ్యారని తెలిపారు.

చెక్​పాయింట్​ వల్ల...

మొగదిషులోని పన్ను కార్యాలయానికి సమీపంలో ఉన్న చెక్​పాయింట్​ వద్ద ట్రాఫిక్​ ఏర్పడటం.. అదే సమయంలో పేలుడు సంభవించడం వల్ల ఘటన తీవ్రత ఎక్కువగా ఉంది. విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్న బస్సు.. పేలుడు పదార్థాలున్న కారును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. అందువల్ల మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు టర్కీ దేశస్థులూ ఉన్నారు.

మొగదిషులో తరచూ కారు బాంబు పేలుళ్లు, దాడులు జరుగుతుంటాయి. అల్​ఖైదా అనుబంధ సంస్థ అల్​-షాబాద్​ ఇస్లామిక్​ మిలిటెంట్స్​ ఈ దాడులకు కారణం. అయితే తాజా ఘటన ఆ దేశంలో గత రెండేళ్లల్లోనే అత్యంత ఘోరమైందని తెలుస్తోంది.

Last Updated : Dec 28, 2019, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details