తెలంగాణ

telangana

ETV Bharat / international

పెరుగుతున్న 'ఇదాయ్​' మృతుల సంఖ్య - malawi

ప్రకృతి ప్రకోపానికి ఆఫ్రికా దేశాలైన జింబాబ్వే, మలావి, మొజాంబిక్​ ప్రజానీకం అతలాకుతలమవుతోంది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మూడు దేశాల్లోనూ భారీసంఖ్యలో మృత్యువాతపడ్డారు. జింబాబ్వేలో ప్రస్తుతం 100 మంది మరణించారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య 300కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

పెరుగుతున్న 'ఇదాయ్​' మృతుల సంఖ్య

By

Published : Mar 20, 2019, 9:40 AM IST

ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ఇదాయ్​ తుపాను ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జింబాబ్వే ప్రకటించింది. శుక్రవారం తుపాను ఆ దేశాలను చిన్నాభిన్నం చేసింది. ఇదాయ్​ ధాటికి జింబాబ్వేలోఇప్పటి వరకు100 మంది మృతిచెందారు. ఈ సంఖ్య 300కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది ప్రభుత్వం.

"మృతుల సంఖ్య వందగా నిర్ధరించాం. మృతులు 300 అని కొన్ని వర్గాలంటున్నాయి. కానీ ప్రస్తుతం మేము దీనిని ధ్రువీకరించలేం. నీళ్లలో మృతుదేహాలు ఇంకా కొట్టుకువస్తున్నాయి. వరద ప్రవాహంలో కొన్ని మొజాంబిక్​కు చేరాయని అనుమానిస్తున్నాం" -జులై మోయో, జింబాబ్వే మంత్రి

తుపాను కారణంగా ఇప్పటివరకు 217మంది గల్లంతయ్యారు. 44 మంది వరదల్లో చిక్కుకున్నారు. తూర్పు జింబాబ్వేలోని చిమానిమని పట్టణంలో ఇదాయ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

ఇదాయ్​ బాధితులకు హెలికాఫ్టర్​ ద్వారా సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details