ఉగ్రదాడితో పశ్చిమాఫ్రికా దేశం మాలీ ఉలిక్కిపడింది. సైనిక స్థావరమే లక్ష్యంగా జరిగిన దాడిలో 53 మంది సైనికులు మృతిచెందారు. ఉగ్ర ఘటనను తీవ్రంగా ఖండించిన మాలీ ప్రభుత్వం.. తమ దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఇస్లాం ఉగ్రవాదుల హింసాకాండ అని పేర్కొంది.
సైనికులతో పాటు ఓ పౌరుడు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని ఘటనాస్థలి నుంచి రక్షించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని... మృతదేహాల వెలికితీత చర్యలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు.