పశ్చిమ నైజీరియా క్వారా రాష్ట్రం ఇదోఫియాన్-ఇల్లోరిన్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మరొకరిని సురక్షితంగా కాపాడామని వివరించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
రెండు వాహనాలు ఢీ-10 మంది మృతి
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఎదురుగా వచ్చి ఢీకొనగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు.
రెండు వాహనాలు 'ఢీ'-10 మంది మృతి
ఓవర్ లోడింగ్, రోడ్డుమార్గాలు సరిగాలేకపోవటం, మితిమీరిన వేగం తదితర కారణాలతో నైజీరియాలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఇదీ చదవండి :పోలీసులే లక్ష్యంగా బాంబుదాడులు- ఇద్దరు మృతి