తెలంగాణ

telangana

ETV Bharat / international

రణరంగంలా అల్జీర్స్​

అల్జీరియా అధ్యక్ష పదవికి అబ్దెలాజిజ్​ 5వసారి పోటీ చేయడాన్ని నిరసిస్తూ వేలమంది ప్రజలు నిరసన చేపట్టారు.

ప్రజలు

By

Published : Mar 2, 2019, 10:13 AM IST

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అల్జీరియా రాజధాని అల్జీర్స్​ దద్దరిల్లింది. ప్రస్తుత అధ్యక్షుడు అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా వరుసగా ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పోలీసులు వారిని నిలువరించడం ఘర్షణలకు దారితీసింది. ఆందోళకారులను రాళ్లు రువ్వగా, పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఈ గొడవల్లో 56 మంది పోలీసులు, ఏడుగురు నిరసనకారులకు గాయాలయ్యాయి. 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అల్జీరియా అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్​ 18న జరగనున్నాయి. తాను మరోమారు పోటీచేస్తున్నట్లు అబ్దెలా​జిజ్​ ప్రకటించారు. దేశంలో ఇటీవల పెరిగిపోయిన నిరుద్యోగం, పేదరికం అబ్దేలా​జిజ్​పై వ్యతిరేకతకు కారణమైంది.

మరోసారి పోటీ వద్దు

ABOUT THE AUTHOR

...view details