తెలంగాణ

telangana

ETV Bharat / international

సోమాలియాలో ఆత్మాహుతి దాడి- 15 మంది మృతి - galkayo

సోమాలియాలోని గాల్కాయో నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది . ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఆ దేశ ప్రధాని మొహమ్మద్ హుస్సేన్ రూబుల్​కు తృటి ప్రాణాపాయం తప్పింది.

somalia blast, suicide bombing
సోమాలియా బాంబు పేలుడులో 15 మంది మృతి

By

Published : Dec 19, 2020, 5:36 AM IST

సోమాలియాలోని గాల్కాయో నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడికి 15మంది బలయ్యారు. నగరంలోని ఓ క్రీడా స్టేడియం ప్రాంగణంలో ఈ పేలుడు జరిగింది. మృతుల్లో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిని తామే జరిపినట్లు అల్​-షబాబ్​ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ప్రధానికి తప్పిన అపాయం..

ఈ ఘటనలో సోమాలియా ప్రధాని మొహమ్మద్ హుస్సేన్ రూబుల్​ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్టేడియంకు మరికొద్ది సేపట్లో ఆయన చేరుకుంటారనగా ఈ దాడి జరిగింది.

ఇదీ చదవండి :అఫ్గానిస్థాన్​లో పేలుడు- 15 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details