తెలంగాణ

telangana

ETV Bharat / international

మొరాకో: బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం - BUS ACCIDENT

మొరాకోలో వరదల కారణంగా ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, సైనిక బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

మొరాకో:బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం

By

Published : Sep 10, 2019, 8:52 AM IST

Updated : Sep 30, 2019, 2:20 AM IST

మొరాకోలో బస్సు ప్రమాదం

మొరాకోలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం వరదల ప్రభావంతో ఎర్రాచిడియా నగరంలో ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

పోలీసులు, సైనిక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపుచర్యలను ముమ్మరం చేశారు. ఇందుకోసం విమానాలను ఉపయోగిస్తున్నారు.

ఇదీ చూడండి:-చంద్రయాన్​-2పై చైనీయుల ప్రశంసలు

Last Updated : Sep 30, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details