తెలంగాణ

telangana

ETV Bharat / headlines

స్వల్ప లాభాలతో ముగింపు- సెన్సెక్స్ 45+ - స్టాక్​ మార్కెట్​ సూచీలు

STOCKS
స్టాక్​ మార్కెట్

By

Published : Aug 25, 2020, 9:36 AM IST

Updated : Aug 25, 2020, 3:47 PM IST

15:43 August 25

ఫ్లాట్​గా స్థిరపడిన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 38,844 వద్దకు చేరింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,472 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, టెక్​ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్, బజాజ్ ఫిన్​సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాలను గడించాయి.

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, నెస్లే, టాటా స్టీల్​, ఎల్​&టీ, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టపోయాయి.

11:52 August 25

స్వల్ప లాభాలు..

మిడ్​ సెషన్​ ముందు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా బలపడి 38,851 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11,473 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. 

బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇటీవల భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టాటా స్టీల్, నెస్లే, హెచ్​సీఎల్​టెక్​, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​, బజాజ్​ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:29 August 25

లాభాల్లో స్టాక్​ మార్కెట్ సూచీలు

అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్​ 116 పాయింట్లు వృద్ధి చెంది 38,915కి చేరింది. నిఫ్టీ 30 పాయింట్లు మెరుగుపడి 11,496 వద్ద ట్రేడ్​ అవుతోంది. డాలర్​తో పోల్చితే రూపాయి మారకం విలువ 74.31గా ఉంది.

ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, నెస్లే, యూపీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Aug 25, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details