జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు - bandi sanjay latest news
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార సభ, రోడ్డుషోలో పాల్గొన్న వీరిద్దరూ భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.
ఎర్రగడ్డలోని సుల్తాన్‌నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. హుస్సేన్‌సాగర్ ఆక్రమణలను ప్రస్తావిస్తూ దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయండి అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఇందుకు ప్రతిగా బల్కంపేటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో బండి సంజయ్ అదే మీరు చేస్తే రెండు గంటల్లో భాజపా కార్యకర్తలు దారుస్సలాంను కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వీరిద్దరి ప్రసంగాలు, వ్యాఖ్యల పూర్వాపరాలను పరిశీలించిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.