తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

కేసీఆర్, కేటీఆర్​ల​కు కానుకగా ఇస్తా: నల్లకుంట అభ్యర్థి శ్రీదేవి - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని, మరోసారి తను గెలిచి పార్టీ అధినేతలకు కానుకగా ఇస్తానని నల్లకుంట డివిజన్ తెరాస అభ్యర్థి వరిగంటి శ్రీదేవి రమేష్ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని పేర్కొన్నారు.

కేసీఆర్, కేటీఆర్​ల​కు కానుకగా ఇస్తా: నల్లకుంట అభ్యర్థి శ్రీదేవి
కేసీఆర్, కేటీఆర్​ల​కు కానుకగా ఇస్తా: నల్లకుంట అభ్యర్థి శ్రీదేవి

By

Published : Nov 27, 2020, 2:02 PM IST

ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని, తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో ఏ గల్లీకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మళ్లీ గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే డివిజన్ నుంచి గతంలో రెండు సార్లు కార్పొరేటర్​గా పనిచేసిన శ్రీదేవి మూడోసారి కూడా ఘన విజయం సాధించి కేసీఆర్, కేటీఆర్​లకు గెలుపును కానుకగా ఇస్తానని అన్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ నన్ను రెండోసారి గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని నల్లకుంట డివిజన్ తెరాస అభ్యర్థి శ్రీదేవి తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్​ల​కు కానుకగా ఇస్తా: నల్లకుంట అభ్యర్థి శ్రీదేవి

ABOUT THE AUTHOR

...view details