భాజపా వల్లే ప్రజాభివృద్ధి : గౌలిపుర అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి - hyderabad elections news
భాజపా వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ గౌలిపుర డివిజన్ అభ్యర్థి ఆలె భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండే తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి బీజేపీ గెలిస్తేనే సాధ్యమని గౌలిపుర డివిజన్ బీజేపీ అభ్యర్థి అలె భాగ్యలక్ష్మి అన్నారు. గౌలిపురా డివిజన్లో ఛత్రినాక సమీప ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోందని, తమ గెలుపు ఖాయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ తాము ముందుండి పరిష్కరిస్తామని, అందుకే ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.