బాగ్అంబర్పేట్ నియోజకవర్గం ఇంద్ర ప్రస్థాన కాలనీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతయ్యాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఇదే బూతులో ఓటు వేశామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 ఫలితాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయి. బాగ్అంబర్పేట్ నియోజకవర్గం ఇంద్ర ప్రస్థాన కాలనీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన ఆయన ఓటరు జాబితాలో పేరు లేకపోవటంతో వెనుదిరిగారు.

తమ్మినేని వీరభద్రం కుటుంబం ఓట్లు గల్లంతు
ఎన్నికల గుర్తింపు కార్డులు ఉండి కూడా తమ కుటుంబం ఓట్లు గల్లంతు కావడం.. ఎన్నికల సంఘం నిర్లక్ష్యమా లేదా రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో తన లాంటి వాళ్ల అనేక మందికి ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారికి ఈ విషయమై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.