జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు.. ప్రముఖులు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు 7 గంటల నుంచే చేరుకున్నారు. పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీసమేతంగా తరలివచ్చి ఓటు వేశారు. కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. దీక్షా మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో.. సతీమణి కావ్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్ పేట్ లో మురళీధర్ రావు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు. నాచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రీపురంలో ఓటేశారు. ద్విచక్రవాహనంపై పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓవైసీ... ఓటు హక్కు వినియోగించుకున్నారు.
భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణం
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందని.. ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆమె.. ప్రజలందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మలక్‌పేట సర్కిల్ అజంపురా డివిజన్లో.. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. చర్లపల్లి డివిజన్ కాప్రాలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లోని నందినగర్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటు వేశారు. కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని వివేకానందనగర్ క్లబ్ హౌస్‌లో శాసనసభ్యులు అరికెపుడి గాంధీ... ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి... సతీమణి స్వప్నతో కలిసి ఓటు వేశారు. అటు ముషీరాబాద్‌లోని కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఓటేశారు. సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బంజారాహిల్స్ యూరో కిడ్స్ స్కూల్లో.. ఓటేశారు.
ఓటు వేసిన ప్రజాగాయకుడు గద్దర్
అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో ప్రజాగాయకుడు గద్దర్ .. తార్నాకలో మాజీ మేయర్ బండకార్తీక, భాజపా ఎమ్మెల్సీ రామచంద్రారావు, గోల్నాకలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అల్వాల్ 134 డివిజన్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని రామచంద్రాపురంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమయత్‌నగర్ ఉర్దూ గల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో.. సీపీఐ జాతీయ నేత నారాయణ.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తరలొచ్చిన తారాలోకం