Yash kgf 2 heroine Srinidhi shetty: 'కేజీయఫ్'లో హీరో ప్రియురాలిగా కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యాను కానీ, 'కేజీయఫ్-2'లో నా రోల్ ఎంతో కీలకంగా ఉండనుందని చెబుతున్నారు నటి శ్రీనిధి శెట్టి. మంగళూరుకు చెందిన శ్రీనిధి 'కేజీయఫ్'తోనే కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టి పాత్రకు ప్రేక్షకుల్లో అనుకున్నంత స్థాయి ఫేమ్ రాలేదు. మరికొన్నిరోజుల్లో 'కేజీయఫ్-2' ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ సినిమా గురించి ఆమె కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
'కేజీయఫ్-2'లో నా పాత్ర ఎంతో కీలకం: శ్రీనిధి
Yash kgf 2 heroine Srinidhi shetty: 'కేజీఎఫ్ 2'లో తన పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని తెలిపారు హీరోయిన్ శ్రీనిధి. ఎప్పుడు ఏం అవసరమైనా సాయం చేయడానికి మూవీటీమ్ మొత్తం ముందుండేదని అన్నారు.
"రీనాగా 'కేజీయఫ్' మొదటి భాగంలో నన్ను చూసిన ప్రేక్షకులందరూ పార్ట్ 2లో నా రోల్‌కు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని భావిస్తున్నారు. కానీ, 'కేజీయఫ్-2'లో నా రోల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. పార్ట్ 1తో పోలిస్తే సీక్వెల్‌లో నా రోల్ ఎక్కువ నిడివే ఉండనుంది. కథతోపాటే నా పాత్ర ప్రయాణిస్తుంటుంది. సుమారు ఆరేళ్ల పాటు 'కేజీయఫ్' టీమ్‌తో కలిసి పనిచేశా. టీమ్‌లో ఉన్న వాళ్లందరూ నాకు బాగా దగ్గరయ్యారు. మేమంతా ఓ కుటుంబంలా ఉండేవాళ్లం. సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎప్పుడు ఏం అవసరమైనా సాయం చేయడానికి టీమ్ మొత్తం ముందుండేది. దర్శకుడు ప్రశాంత్ మంచి వ్యక్తి. నాకు ఒక సోదరుడు, ఫ్రెండ్, మెంటార్ అంతేకాకుండా కొన్నిసార్లు తండ్రిలా మంచి సలహాలు ఇచ్చేవారు. 'కేజీయఫ్' షూట్ చివరి రోజు టీమ్ మొత్తానికి దూరం అవుతున్నందుకు కన్నీళ్లు పెట్టేసుకున్నా" అని శ్రీనిధి తెలిపారు.
ఇదీ చూడండి: అంతరిక్షమే హద్దు.. రాబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే!