తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కేజీఎఫ్​ 2': రాఖీభాయ్​దే హవా.. వరల్డ్​లోనే రెండో చిత్రంగా! - కేజీఎఫ్​ 2 బాలీవుడ్ కలెక్షన్స్​

KGF 2 Collectons records: కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' గ్లోబల్​ బాక్సాఫీస్​ ముందు రికార్డు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు బాలీవుడ్​లోనూ అత్యంత వేగంగా రూ.200కోట్ల క్లబ్​లో చేరే తొలి చిత్రంగానూ ఘనత సాధించనుంది.

Yash KGF 2 Collections records
కేజీఎఫ్​ 2

By

Published : Apr 18, 2022, 2:20 PM IST

KGF 2 Collectons records: టాలీవుడ్​ టు బాలీవుడ్​.. ఇప్పుడంతా 'కేజీఎఫ్ 2' రాఖీభాయ్​దే హవా కొనసాగుతోంది. బాక్సీఫీస్​ ముందు రికార్డులు సృష్టించిన 'ఆర్ఆర్​ఆర్​'ను మించి ఊహించని రీతిలో వసూళ్లను అందుకుంటోంది! కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ హీరోగా నటించిన చిత్రమిది. 'కేజీఎఫ్​ 1'కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్​ దర్శకుడు. ఏప్రిల్​ 14న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రికార్డులను కొల్లగొడుతోంది.

దేశవ్యాప్తంగా వీకెండ్​లో భారీ మొత్తంలో వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది 'కేజీఎఫ్​ 2'. కామ్​స్కోర్​ నివేదిక ప్రకారం గ్లోబల్​ బాక్సాఫీస్​లో ఏప్రిల్​ 15 నుంచి 17 మధ్య అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల్లో 'కేజీఎఫ్'​ రెండో స్థానంలో నిలిచింది. కాగా, విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా కెలెక్ట్​ చేసింది. తొలి రోజు(రూ.165.37కోట్లు), రెండో రోజు(రూ.139.25), మూడో రోజు(రూ.115.08), నాలుగో రోజు(రూ.132.13) వచ్చినట్లు ట్రేడ్​ వర్గాలు పేర్కొన్నాయి.

కేజీఎఫ్​ 2.. గ్లోబల్​ కలెక్షన్స్​

Bollywood KGF 2 collections record: ఇక బాలీవుడ్​లోనూ చరిత్ర సృష్టించిన 'కేజీఎఫ్​ 2' మరో ఘనత సాధించనుంది. అత్యంత వేగంగా రూ.200కోట్ల క్లబ్​లో అడుగుపెట్టనున్న తొలి చిత్రంగా ఘనత అందుకోనుంది. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి రూ.193.99కోట్లను కలెక్ట్​ చేసింది. తొలి రొజు(రూ.53.95), రెండో రోజు(రూ.46.79), మూడో రోజు(రూ.42.90), నాలుగో రోజు(రూ.50.35) వసూళ్లను సాధించింది. ఐదో రోజు(సోమవారం) రూ.200కోట్లు దాటడం పక్కా అనే చెప్పాలి.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 3' ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ!

ABOUT THE AUTHOR

...view details