తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నిహారికతో విజయ్ ​దేవరకొండ లైగర్​ ఫైట్, వీడియో అదిరింది - విజయ్​ దేవరకొండ నిహారిక లైగర్​

Vijaydevarkonda Niharika Fight రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో నిహారికతో తలపడ్డారు. కరాటే, కిక్‌ బాక్సింగ్‌ చేస్తూ ఆయనపై దాడికి దిగారు. వీరిద్దరి మధ్య ఇంతటి పోరు జరగడానికి కారణమేమిటంటే..

Vijaydevarkonda Niharika liger fight
దేవరకొండ నిహారిక లైగర్​ ఫైట్​

By

Published : Aug 24, 2022, 11:53 AM IST

Vijaydevarkonda Niharika Fight టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్' ఇంకో రోజులో రిలీజ్ కానుంది. దాదాపు నెల రోజుల‌ నుంచి 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్స్​లో బిజీగా ఉన్న విజ‌య్.. తాజాగా సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త ప్ర‌మోష‌న్ చేశారు. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎన్‌.ఎమ్‌.నిహారికతో 'లైగ‌ర్' ఫైట్​కు సిద్ధమయ్యారు. ప్ర‌స్తుతం వీరి ఫైటింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లనే కాకుండా సెలబ్రిటీల దృష్టినీ ఆకట్టుకుంటున్నారు నిహారిక. 'కేజీయఫ్‌', 'సర్కారు వారి పాట', 'రన్‌ వే 34', 'జెర్సీ' (హిందీ వెర్షన్‌), 'మేజర్‌'.. ఇలా ఇటీవల విడుదలైన పలు క్రేజీ ప్రాజెక్టులకు ఆయా చిత్రాల హీరోలతో కలిసి ఆమె ప్రమోషనల్‌ వీడియోలు చేశారు. తాజాగా ఇప్పుడామె 'లైగర్‌' కోసం ఓ స్పెషల్​ వీడియో చేశారు.

ఈ వీడియో ఆరంభంలో విజయ్‌తో ఫైట్‌ చేస్తున్నట్లు కనిపించిన ఆమె అనంతరం ఆయన కటౌట్‌కు ఫిదా అయినట్లు ఎంతో సరదాగా చూపించారు. అలాగే.. విజయ్‌ను ఇమిటేట్‌ చేస్తూ నత్తి ఉన్నట్లు ఆమె మాట్లాడటం నవ్వులు పూయించేలా ఉంది. ప్రస్తుతం ఈవీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక, ఇలియానా, సుస్మితా కొణిదెల, సోనాల్‌ దేవ్‌రాజ్‌, నిఖిల్‌ తనీజా.. తదితరులు దీనిపై స్పందిస్తూ.. వీడియో ఫుల్‌ ఫన్నీగా ఉందని అన్నారు.

కాగా, 'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, అన‌న్య పాండేలు జంట‌గా న‌టించిన‌ ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మైక్ టైస‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మించారు.

ఇదీ చూడండి: చిరంజీవి, సురేఖ పెళ్లి వెనక జరిగిన ఈ కథ తెలుసా

ABOUT THE AUTHOR

...view details