Vijay sethupati H vinod movie: తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. కొన్నాళ్లుగా ప్రతినాయక పాత్రలతోనే మెప్పిస్తూ వస్తున్నారాయన. ఆయన ఇటీవల 'విక్రమ్'లోనూ విలన్‌గా కనిపించి అలరించారు. ఇప్పుడాయన హీరోగా ఓ కొత్త సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. దీన్ని హెచ్.వినోద్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. వినోద్ ప్రస్తుతం అజిత్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన విజయ్ సేతుపతి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన హర్రర్ డ్రామా కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని, సేతుపతి పాత్ర కొత్తగా ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది.
విజయ్ సేతుపతి హీరోగా కొత్త చిత్రం!.. దర్శకుడు ఎవరంటే? - విజయ్ సేతుపతి హెచ్ వినోద్ కాంబోలో సినిమా
Vijay sethupati H vinod movie: కొన్నాళ్లుగా ప్రతినాయక పాత్రలతోనే మెప్పిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. హీరోగా ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. దీన్ని హెచ్.వినోద్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
దీంతో పాటే విజయ్.. 'పుష్ప 2'లోనూ నటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈయనకు జోడీగా ప్రియమణి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇంకా విజయ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌తో 'మెర్రీ క్రిస్మస్' సినిమా చేస్తున్నారు. 'అంధాదున్' దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని రమేష్ తరుణి, సంజయ్ రౌట్రే నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ పనిలో విజయ్‌సేతుపతి- కత్రిన ఫుల్ బిజీ.. ఫొటోస్ వైరల్!