vijay devarkonda meets mumbai theatre owner 'విజయ్ దేవరకొండకు ఒళ్లంతా పొగరు. వినాశకాలే విపరీత బుద్ది. . లైగర్ ప్రమోషన్స్ లో అతడు చేసిన ఓవర్ యాక్షన్ వలన సినిమా పోయింది. అతడి చేష్టల వల్ల మేము నష్టపోయాం. అతడు కొండ కాదు అనకొండ.. అంటూ ఇటీవలే నానామాటలు అన్నారు ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్. ఈ వ్యాఖ్యలు ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయినా రౌడీ హీరో ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది.తాజాగా అతడు ముంబయికి వెళ్లి మనోజ్ దేశాయ్‌ను కలిసి తాను ఏం మాట్లాడాడో వివరించాడు. అతడితో మాట్లాడిన తర్వాత మనోజ్ తన విమర్శలు తప్పని తెలుసుకుని హీరోకు సారీ చెప్పారు.
ఫుల్‌గా తిట్టినోడే పొగిడేశాడుగా, థియేటర్ ఓనర్ కాళ్లు మొక్కిన రౌడీహీరో
విజయ్ దేవరకొండ అహంకారి.. ఆయన చిత్రాన్ని ఓటీటీలోనూ చూడరు అంటూ ఇటీవల విరుచుకుపడిన ముంబయి థియేటర్ యజమాని.. ఇప్పుడు అదే హీరోని మెచ్చుకున్నారు. విజయ్ మంచి వ్యక్తి అని, తానే తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్‌లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ క్రమంలోనే విజయ్, ఆ థియేటర్ కాళ్లను కూడా మొక్కారు. ఇక వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.