Vijay Devarakonda Kushi :టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అగ్ర కథానాయిక సమంతజంటగా నటించిన సినిమా 'ఖుషి'. 'మజిలీ' ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని.. హీరో విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఆ వీడియోలో ఎం మాట్లాడారంటే..
ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూసిన ప్రేక్షకులు నవ్వుతూ బయటకు వస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడియెన్స్ నుంచి శుక్రవారం వచ్చే ఈ రెస్పాన్స్ గురించి ఎన్నో రోజలుగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు మూవీ టీమ్‌కు 'ఆల్ ది బెస్ట్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Shiva Nirvana Movies: డైరెక్టర్ శివ నిర్వాణ.. ఇదివరకే 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక సినిమా విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు.. ఈ చిత్రంలో హిందూ- ముస్లిం మధ్య గొడవల ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాకు హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.