తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నయన్‌- విఘ్నేశ్‌ పెళ్లి డేట్ ఫిక్స్.. శ్రీవారి సమక్షంలో ఏడడుగులు! - నయనతార విగ్నేశ్ శివన్ పెళ్లి డేట్

nayanthara marriage date: కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహానికి ముహూర్తం ఖరారైంది! తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరు ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వివాహ తేదీ ఎప్పుడంటే?

VIGNESH SHIVAN NAYANATARA MARRIAGE
VIGNESH SHIVAN NAYANATARA MARRIAGE

By

Published : May 7, 2022, 11:36 AM IST

Updated : May 7, 2022, 11:56 AM IST

nayanthara marriage update: సెలబ్రిటీ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదే నిశ్చితార్థమైంది. దీంతో వీరి పెళ్లి వార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకొందని.. జూన్‌ 9న వీరి వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరు ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని.. సినీ సెలబ్రిటీలు, ఇతర స్నేహితుల కోసం చెన్నైలో గ్రాండ్‌గా వివాహ విందు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

nayanthara vignesh shivan: అయితే.. ఈ వార్తలపై నయన్‌, విఘ్నేశ్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, విఘ్నేశ్‌ దర్శకత్వంలో నయన్‌, సమంత, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన 'కాతువాకుల రెండు కాదల్‌' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో నయన్‌-విఘ్నేశ్‌ గత కొన్నిరోజులుగా దేశంలోని పలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి వస్తున్నారు. అలా, వీరిద్దరూ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:తల్లి కాబోతున్న నయనతార?.. కేసు పెట్టిన సామాజిక కార్యకర్త!

Last Updated : May 7, 2022, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details