తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వేడుకగా వరుణ్‌- లావణ్య ఎంగేజ్​మెంట్​.. మెగా, అల్లు హీరోల సందడే సందడి! - వరుణ్​తేజ్​ లావణ్య వివాహం

Varun Tej Lavanya Tripathi Engagement : హీరోహీరోయిన్లు వరుణ్​ తేజ్​, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా, అల్లు హీరోలు హాజరై సందడి చేశారు.

Varun Tej Lavanya Tripathi Engagement
Varun Tej Lavanya Tripathi Engagement

By

Published : Jun 9, 2023, 10:18 PM IST

Varun Tej Lavanya Tripathi Engagement : రీల్‌ కపుల్‌ వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి త్వరలోనే రియల్‌ కపుల్‌ కానున్నారు. వీరి వివాహం మరికొన్ని నెలల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ దంపతులు, అల్లు అర్జున్​, అల్లు శిరీష్​, వైష్ణవ్​ తేజ్​ సహా పలువురు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. వారంతా నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వరుణ్‌తేజ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా సోషల్‌మీడియాలో #VarunLav హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Varun Tej Lavanya Tripathi Love Story : వాస్తవానికి 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి అప్పుడు 'మిస్టర్‌' అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకుని డేటింగ్‌ వరకు వెళ్లారట. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేశారని టాక్​

వీరిద్దరూ కలిసి నటించిన రెండో సినిమా 'అంతరిక్షం' సమయంలో ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. అయినా కూడా ఇరువురు స్పందించలేదు. ఇక నిహారిక పెళ్లి (2020లో) సమయంలో మెగా ఇంట లావణ్య చేసిన సందడి చూసి నిజంగానే వరుణ్‌, లావణ్య ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. పలు వెబ్‌సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య కానీ స్పందించలేదు.

దీంతో ఇదంతా ఒట్టి ఊహాగానామే అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం డేట్‌ అనౌన్స్‌ చేసి షాకిచ్చారు. లావణ్య దగ్గరు వరుణ్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టగా.. అమె వెంటనే ఓకే చెప్పేసిందట. మెగా ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో వరుణ్‌ తేజ్‌, లావణ్యల పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Varun Tej Upcoming Movies : ఇక, వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'గాండీవధారి అర్జున' చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు 25న ఇది విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత వరుణ్‌.. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

Lavanya Tripathi Upcoming Movies : మరోవైపు, లావణ్య ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అధర్వ హీరోగా ఇది తెరకెక్కుతోంది. పీపుల్స్‌ మీడియా ప్యాక్టరీ నిర్మించిననున్న ఓ సినిమాలో అలాగే, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details