Varun Lavanya Wedding Invitation :టాలీవుడ్ సీనియర్ హీరో నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పీటలెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వరుణ్- లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలో ఈ ఇద్దరూ ఒక్కటవ్వనున్నారు. సన్నిహితుల సమక్షంలో జూన్ 9న ఈ జంటకు గ్రాండ్గా నిశ్చితార్ధం జరగ్గా.. ఇటలీలోని టస్కానీలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అతి కొద్దమంది సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. తాజాగా ఈ జంట బ్యాచిలర్ పార్టీని కూడా చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాలు అటు వేడుకలతో పాటు ఇటు పెళ్లి పనుల్లోనూ బిజీగా ఉన్నాయి.
ఇక ఈ జంట నవంబర్ 1న వివాహ బంధంలోకి అడుగపెట్టనుండగా.. తాజాగా వీరి పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిల్వర్ కలర్లో ఉన్న ఆ కార్డు చూడటానికి ఎంతో అట్రాక్టివ్గా ఉంది. అందులో మొదట వరుణ్ తాత, నాన్నమ్మల పేర్లను పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లు కూడా పెళ్లి కార్డులో ఉన్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డులో తమ స్టార్స్ పేర్లు చూసి తెగ సంబరపడుతున్నారు.