Varun Lavanya Marriage Videos : టాలీవుడ్ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి జంట తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇటలీలోని టస్కానీ వేదికగా నవంబర్1 న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అంగరంగవైభవంగా ఈ వేడుక జరగ్గా.. దీనికి సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
ఈ జంట పెళ్లి వీడియో.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుందంటూ న్యూస్ వెలువడింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై వరుణ్ తేజ్ టీమ్ స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని కోరింది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినప్పటికీ.. ఎప్పటికైనా పెళ్లి వీడియో గ్లింప్స్‌ను వరుణ్- లావణ్య తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా క్యాస్ట్యూమ్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన పెళ్లిలో క్రీమ్ కలర్డ్ గోల్డ్ షేర్వానీ ధరించారు. పెళ్లి కూతూరు లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా తయారు చేసిన ఎరుపు రంగు కాంచీపురం చీరలో కనిపించింది. ఈ ఇద్దరూ తమ డిజైనర్ దుస్తులతో వేడుకకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే అంత అందంగా ఈ పెళ్లి కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది మరెవరో కాదు.. ఫేమస్ వెడ్డింగ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. ఆయన దేశంలోని అనేక మంది సెలబ్రిటీల వివాహాలకు ఇప్పటివరకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేశారు.