తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అత్తమ్మను మిస్‌ అవుతున్నా: ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​ - upasana konidela news

ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మెగా పవర్​స్టార్​ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఓ ఎమోషనల్​ పోస్ట్ పెట్టారు. తమ అత్తమ్మ సురేఖను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

Upasana emotional post about surekha
అత్తమ్మను మిస్‌ అవుతున్నా: ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​

By

Published : Dec 16, 2022, 11:34 AM IST

Updated : Dec 16, 2022, 12:40 PM IST

మెగా పవర్​స్టార్​ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత పుట్టింటి వారిని కలిసిన ఆమె ఎంతో సరదాగా గడిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. అయితే, తన అత్తమ్మ, చిరంజీవి సతీమణి సురేఖను మిస్‌ అవుతున్నట్లు చెప్పారు. తల్లి శోభనా కామినేని, అమ్మమ్మ, ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఈ మాటను చెప్పారు.

"నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీస్సులతో మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సమయంలో అత్తమ్మను మిస్‌ అవుతున్నా" అని ఉపాసన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇటీవలే చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోమవారం మధ్యాహ్నం చిరంజీవి తీపికబురు చెప్పారు. "హనుమాన్‌ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో.. మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్‌ కామినేని" అని పేర్కొన్నారు. ఈ వార్తతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:అవతార్​ 2 మూవీ హీరోయిన్​ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా

Last Updated : Dec 16, 2022, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details