ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరించిన కార్యక్రమం 'అన్‌స్టాపబుల్'. రెండో సీజన్‌లో భాగంగా అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ కార్యక్రమం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రారంభంకానుంది. సంబంధిత ఎపిసోడ్ అక్టోబరు 14న టెలికాస్ట్ కాబోతుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. 'టు లెజెండ్స్.. వన్ సెన్సేషనల్ ఎపిసోడ్' అంటూ ఆహా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
బాలయ్య అన్‌స్టాపబుల్‌లో గెస్ట్‌గా చంద్రబాబు.. వచ్చేది ఆరోజే - అన్‌స్టాపబుల్ సీజన్ 2 చంద్రబాబు
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది ఆహా సంస్థ.
బాలయ్య అన్‌స్టాపబుల్‌లో గెస్ట్‌గా చంద్రబాబు
తొలి సీజన్‌లో మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, తమన్, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్, సుకుమార్, రవితేజ, రానా, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, మహేశ్‌బాబు తదితరులు పాల్గొని వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాలు పంచుకున్నారు. అలాంటిది ఇప్పుడీ కార్యక్రమానికి రాజకీయ నాయకుడు, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు వెళ్లడం వల్ల అంతటా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ