Actress Trisha Insta Post: 'వర్షం'తో తెలుగు తెరకు పరిచయమై.. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ మెప్పించారు త్రిష. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేసి అగ్ర కథానాయికగా రాణించిన ఆమె.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
"విషపూరితమైన మనస్వత్తం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే తొలగిపోయినట్లు ఉంది" అని త్రిష రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 'త్రిష మరోసారి ప్రేమలో విఫలమయ్యారా?', 'ఇంతకీ ఆమె ఎవర్ని ఉద్దేశిస్తూ ఈ పోస్టు పెట్టారు'.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.