తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రపంచంలోనే టాప్​ 10 రిచెస్ట్ యాక్టర్లు వీరే- భారత్​ నుంచి ఎవరు ఉన్నారంటే? - ప్రపంచంలో టాప్​ 5 నటుల పేర్లు

Top 10 Richest Actors In The World : ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులు ఎవరనేది తెలుసుకోవాలని ఉందా? ఈ జాబితా చూస్తే మీరు ఆశ్చర్యపడొచ్చు. టాప్ టెన్ రిచెస్ట్ యాక్టర్లలో మన దేశం నుంచి ఒకే ఇద్దరు అగ్ర హీరోలు చోటు సంపాదించారు. ఆ ధనిక హీరోలు ఎవరో? పూర్తి వివరాలు మీకోసం.

Top 10 Richest Actors In The World
Top 10 Richest Actors In The World

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 5:02 PM IST

Top 10 Richest Actor In The World :నటుల పాపులారిటీ అంటే వారి సినిమాలు, షోల ద్వారానే కాకుండా నటనేతర కార్యక్రమాల ద్వారా కూడా వారు ఆదాయం సంపాదిస్తుంటారు. నటుడి సంపాదన అంటే బాక్సాఫీసు వసూళ్లు, వారు తీసుకునే పారితోషికం ఒక్కటే కాదు. వ్యాపారాలు, బ్రాండింగ్, పుస్తకాలపై రాయల్టీలు వంటి అనేక ఇతర మార్గాలు కూడా సంపాదన పోగు చేస్తాయి.

ఈ విధంగా పరిశీలిస్తే నటనే కాకుండా ఇతర మార్గాల ద్వారా బాగా సంపాదిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు బిలియనీర్లుగా చెప్పొచ్చు. ప్రపంచంలో టాప్ 10 బిలీయనీర్ యాక్టర్లలో ఎక్కువ మంది హాలీవుడ్ నటీనటులే. మన దేశం నుంచి బిగ్ బీ అమితాబ్ తోపాటు సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కూడా టాప్ టెన్ యాక్టర్లలో స్థానం సంపాదించారు.

1. అత్యంత ధనిక నటి జామి గెర్టజ్
Jami Gertz Net Worth :ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నటి జామీ గెర్టజ్ (3 బిలియన్ డాలర్లు). అమెరికాలోని అత్యంత ధనిక నటీమణుల్లో ఒకరు. ఆమె సంపాదన గత అక్టోబర్ నాటికి మూడు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల్లో కూడా జామీ నిలిచారు. 1980వ దశకంలో ది లాస్ట్ బాయ్స్ అండ్ ట్విస్టర్ వంటి ఐకానిక్ సినిమాలు, స్టిల్ స్టాండింగ్ అల్లీ మెక్ బీల్ వంటి టీవీ సిరీస్ పాత్రలతో జిమ్మీ తెరంగేట్రం చేశారు.

తన భర్త టోనీ రెస్లర్‎తో కలిసి గెర్టజ్ ఎన్బీఎ కంపెనీ అట్లాంటా హాక్స్ సహ యజమాని. మిల్వాకీ బ్రూవర్స్‎లో మైనార్టీ వాటా కూడా ఉంది. మాలిబు, బెవర్లీ హిల్స్ వంటి రియల్ ఎస్టేట్ హోల్టింగ్స్‎లో కూడా జామి జంట పెట్టుబడులు పెట్టడంతో రెండు చేతులా సంపాదిస్తున్నారు ఈ జంట. ఈ వ్యాపారాలే కాకుండా టెక్నాలజీ రంగంలోనూ క్రిప్టో కరెన్సీ రంగాల్లోనూ వీరికి పెట్టుబడులు ఉన్నాయి.

2. టైలర్ పెర్రీ
Tyler Perry Net Worth 2023 :సుమారు ఒక బిలియన్ డాలర్ల నికర విలువతో ధనిక నటీనటుల్లో రెండో స్థానం ఆక్రమిస్తున్నారు టైలర్ పెర్రీ. నటుడిగా నిర్మాతగా, స్క్రీన్ రైటర్‎గా టైలర్ పెర్రీ ప్రసిద్ది చెందారు. టైలర్ పెర్రీ స్టుడియోస్ అమెరికాలోనే అతిపెద్ద సినిమా స్టుడియో. ఇది వార్నర్ బ్రదర్స్, పారామౌంట్ స్టుడియోస్ కంటే పెద్దది. అతని రాగ్స్ టు రిచ్ కథలో పెర్రీ సంకల్పం విజయానికి దారితీస్తుంది. 1969లో న్యూ ఓర్లీన్స్‎లో పుట్టిన పెర్రీ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ రచన ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెర్రీ సినిమాలు, టీవీ షోలు విజయవంతం కావడంతో ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

టైలర్ పెర్రీ మొదటి సినిమా డైరీ ఆఫ్ ఎ మ్యాడ్ బ్లాక్ ఉమెన్ 50.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అతడు నిర్మించిన సినిమాల వసూళ్లు 100 మిలియన్ డాలర్లు కన్నా ఎక్కువే. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించిన పెర్రీ సవాళ్లను అధిగమించి అపారమైన విజయాలను సొంతం చేసుకోవ్చని నిరూపించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

3. జెర్రీ సీన్ఫెల్డ్​
Jerry Seinfeld Net Worth : 2023న్యూయార్క్‎లోని బ్రూక్లిన్ ప్రాంతానికి చెందిన కమెడియన్ జెర్రీ సెయిన్ ఫెల్డ్. ఈ ఏడాది 950 మిలియన్ డాలర్ల నికర సంపదను ఆర్జించి హాలీవుడ్లో ఐకానిక్ స్టార్గా నిలిచాడు. అతడి సంపద ప్రధానంగా ఐకానిక్ సిట్ కామ్ సీన్ఫెల్డ్, బీ మూవీ వంటి రచనలు, వెబ్ సిరీస్, కమెడియన్స్ ఇన్ కార్స్ గెటింగ్ కాఫీ నుంచి వచ్చింది. సీన్ఫెల్డ్ న్యూయార్క్ నగరంలోని కామెడీ క్లబ్లలో తన జీవితాన్ని ప్రారంభించాడు. నాలుగు దశాబ్దాలుగా నటన, రచన, నిర్మాణం, స్టాండప్ కామెడీ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నాడు జెర్రీ సీన్ఫెల్డ్.

4. డ్వేన్ 'ది రాక్' జాన్సన్
Dwayne The Rock Johnson Net Worth :డ్వేన్ 'ది రాక్' ప్రపంచంలోనే నాలుగో సంపన్న నటుడు. 800 మిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానాన్ని ఆక్రమించిన డ్వేన్ ది రాక్ అంటే అతని శక్తి, చరిష్మాయే గుర్తుకొస్తాయి. స్వతహాగా రెజ్లర్ అయిన డ్వేన్ రెజ్లింగ్ నుంచి హాలీవుడ్ వరకు అతడు సాగించిన ప్రయాణం అద్బుతం. అమెరికాలోని మియామిలో జన్మించిన ఈ పవర్ హౌస్ దశాబ్దాలుగా వినోద పరిశ్రమలో కొనసాగుతున్నాడు.

బ్లాక్ ఆడమ్, రెడ్ నోటీస్ వంటి చిత్రాల్లో డ్వేన్ నటన.. హాలీవుడ్లో అతడి పాత్రను సుస్థిరం చేశాయి. అగ్ర శ్రేణి నటుడిగా ఉన్న డ్వేన్ 'ది రాక్'స్థిరమైన బాక్సాఫీస్ విజయాలతో నిర్మాతలకు లాభాలు పంచిపెడుతున్నాడు. దీంతో ఆయన పారితోషికం ప్రతి సినిమాకు 20 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నాడు.

5. షారూక్ ఖాన్
Shahrukh Khan Net Worth :బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ కూడా ప్రపంచంలో అత్యంత ధనిక నటీనటుల్లో ఒకరు. 730 మిలియన్ డాలర్ల సంపాదనతో ఈ జాబితాలో షారుక్ ఖాన్ ఐదో స్థానంలో నిలుస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర హీరోగా చలామణీ అవుతున్న షారూక్ నటనతోపాటు పెప్సీ, ట్యాగ్ హ్యూయర్, లక్స్, బిగ్ బాస్కెట్ వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‎గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్‎గా కూడా షారుక్ వ్యవహరించాడు.

షారుక్ ఖాన్ నటించే సినిమాకు పది మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకుంటాడని చెబుతున్నారు. కెరీర్లో 14 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్న షారూక్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, మై నేమ్ ఈజ్ ఖాన్, చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలలోషారుక్ ఖాన్ నటించాడు.

6. టామ్ క్రూజ్
Tom Cruise Net Worth :600 మిలియన్ డాలర్ల సంపాదనతో ధనిక నటీనటుల జాబితాలో టామ్ క్రూజ్ ఆరో స్థానంలో నిలుస్తున్నాడు. 1962లో న్యూయార్క్‎లోని సిరాక్యూస్‎లో జన్మించిన క్రూజ్ 1980ల్లో రిస్కీ బిజినెస్‎లో ఒక విజయవంతమైన పాత్రతో తన కెరీర్‎ను ప్రారంభిన క్రూజ్ టాప్ గన్ మిషన్, ఇంపాజిబుల్ సిరిస్, జెర్రీ మాగ్వైర్ వంటి చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించాడు. హాలీవుడ్ ఐకాన్ స్టార్గా, గ్లోబల్ సూపర్ స్టార్‎గా టామ్ క్రూజ్ ఎదిగాడు. కేవలం నటనతోనే కాకుండా ఇతర వ్యాపారాలు చేసిన క్రూజ్ ఇంపాజిబుల్ సిరీస్ నుంచే 600 మిలియన్ డాలర్లు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా బాగా సంపాదించిన క్రూజ్ ప్రస్తుతం 61 ఏళ్ల వయసులోనూ హాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

7. జార్జ్ క్లూనీ
George Clooney Net Worth :ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్న జార్జ్ క్లూనీ సంపద 500 మిలియన్ డాలర్లు. టీవీ షోల్లో చిన్నచిన్న పాత్రలు, ప్రదర్శనలతో కెరీర్‎ను ప్రారంభించిన జార్జ్ క్లూనీ ఈఆర్లో డాక్టర్ డౌగ్ రాస్ పాత్రతో బంగారు పతకం సాధించాడు. ఓషన్స్ ఎలెవన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రంలో మరచిపోలేని పాత్రలో నటించిన జార్జ్... సిరియానాలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‎తో గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు. కేవలం గ్లామర్ హీరోగానే కాకుండా దాత్రుత్వ కార్యక్రమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జార్జ్.

8. రాబర్ట్ డి నీరో
Robert De Niro Net Worth :ఏడేళ్ల వయసు నుంచే నటన మొదలుపెట్టిన రాబర్డ్ డి నీరో ధనిక నటుల జాబితాలో 8వస్థానంలో నిలిచాడు. 1943లో జన్మించిన రాబర్డ్ 1950ల్లో సినీ రంగ ప్రవేశం చేశాడు. ద గాడ్ ఫాదర్ పార్ట్ 135, రేజింగ్ బుల్ చిత్రాల్లో అవార్డు గెల్చుకున్న రాబర్డ్ డి నీరో మొత్తం సంపాదన 500 మిలియన్ డాలర్లు. నటుడిగానే కాకుండా ఒక విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా తనను తాను రాబర్డ్ డి నీరో నిరూపించుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా మూడు డజన్లకు పైగా రెస్టారెంట్లు, 8 లగ్జరీ హోటల్స్, నోబు హాస్పిటాలిటీ గ్రూపు వ్యవస్థాపకుడిగా రాబర్డ్ డి నీరో ఉన్నాడు. అంతేకాకుండా 2003లో ట్రిబెకా ఎంటర్ ప్రైజెస్‎ను స్థాపించాడు. ఇందులో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్, ట్రిబెకా సినిమాస్ ఉన్నాయి. రాబర్డ్ డి నీరో సంపాదన రెట్టింపు కావడంలో ట్రిబెకా ప్రముఖ పాత్ర పోషించింది.

9. ఆర్నాల్డ్ స్వ్కార్జెనెగర్
Arnold Schwarzenegger Net Worth :450 మిలియన్ డాలర్ల సంపాదనతో సంపన్న నటుల జాబితాలో 9వ స్థానాన్ని ఆక్రమించాడు ఆర్నాల్డ్. 1970లో కెరీర్ ప్రారంభించిన ఆర్నాల్డ్ హెర్కులస్ అనే సినిమాలో తొలిసారి నటించాడు. అప్పటి నుంచి స్టార్ డమ్ కొనసాగిస్తున్న అతడు పలు ఇతర రంగాల్లో రాణించాడు. ముఖ్యంగా బ్రిక్లేయింగ్ వెంచర్లు, రెస్టారెంట్ వ్యాపారంతో తెలివిగా సంపాదించాడు. 2003 నుంచి 2011 వరకు గవర్నర్గా పనిచేసిన ఆర్నాల్డ్ తాను నటించిన ప్రతి సినిమాకు 30 మిలియన్ డాలర్లు వసూలు చేస్తాడు.

10. అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Net Worth :ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంపన్న నటుల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. 410 మిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న బిగ్ బి బాలీవుడ్లో మకుటం లేని మహారాజుగా చెప్పొచ్చు. సుమారు 50 ఏళ్ల సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో ప్రత్యేక పాత్రలు పోషించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు అమితాబ్. మన దేశంలోనే ప్రతిష్టాత్మక పురస్కారాలైన పద్మభూషన్, పద్మవిభూషన్ అవార్డులను తీసుకున్న అమితాబ్ జాతీయ చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఎన్నింటినో తీసుకున్నాడు. కేవలం నటనే కాకుండా వ్యాపార రంగంలోనూ అమితాబ్ కుటుంబం ఆదాయం సంపాదిస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి వంటి ప్రత్యేక సిరీస్ లకు హోస్టింగ్ చేశారు అమితాబ్.

'ఆమె గురించి సందీప్​ను ఎన్నో సార్లు అడిగాను - ఓ నటిగా ప్రశ్నించాను'

ట్రెండీ డ్రెస్సు​​లో బాలీవుడ్​ భామ- కిల్లింగ్​ లుక్స్​తో కృతి సనన్ ఫోజులు!

ABOUT THE AUTHOR

...view details