ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 54 ఏళ్లు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.
పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు.. పవన్ కళ్యాణ్ హీరోగా "గోకులంలో సీత, తొలిప్రేమ" వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'గోదావరి' చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ గురించి 'అందాలనటుడు' పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
దిగ్గజ నటుడి కుమార్తె హఠాన్మరణం.. సినీ పరిశ్రమలో విషాదం - నిర్మాత జీవీవీ రాజు భార్య మృతి
నాటి తరం అందాల నటుడు హరనాథ్ కూతురు, ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు.
padma raju
త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారని ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఏడాది తన తనయుడ్ని నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లో పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరమని సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరి, జి.వి.జి రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని ప్రార్థించారు.
Last Updated : Dec 20, 2022, 6:15 PM IST