తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ బ్యూటీస్​కు 'డబుల్‌ ధమాకా'.. మరి రేసులో గెలిచేదెవరో ? - బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ సినిమాలో నభా నటేశ్​

తమ అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న పూజా హెగ్డే, నభా నటేశ్​.. త్వరలో అభిమానుల ముందుకు డబుల్​ ధమాకాతో రానున్నారట. ఆ విశేషాలు మీ కోసం..

pooja hegde and nabha natesh
pooja hegde and nabha natesh

By

Published : Jun 28, 2023, 8:03 AM IST

కొన్నిసార్లు కాల్షీట్లు... మరికొన్నిసార్లు అనివార్య కారణాలు .. ఇలా బుల్లితెరపైనే కాదు వెండితెరపై అప్పుడప్పుడు అవకాశాలు అటూ ఇటూ అవుతుంటాయి. అయితే దీని వల్ల స్టార్స్​ కెరీర్​కు ఎటువంటి ముప్పు అయితే వాటిల్లదు. పరాజయాలు వారిని పలకరించినా సరే.. కాస్త మనసు పెడితే మంచి అవకాశాలే వారిని వెతుక్కుంటూ వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో యువ నాయికలతో పాటు సీనియర్స్​ కూడా పోటీ పడుతూ వరస ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. ఒక వేళ అలా అవకాశాలు రాకపోతే తమ కెరీర్​ను ఎండ్ కార్డ్ పడుతుందేమో అని సతమతమయ్యే నాయికలు కూడా ఉండనే ఉన్నారు. అయినప్పటికీ వారి నటనే అప్పుడప్పుడు వారిని గట్టెక్కిస్తుంటూ వస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్​లో కొందరు తారలు.. కొన్ని కొన్ని కారణాల వల్ల తమకు వచ్చిన అవకాశాలను వదులుకుంటూ వస్తున్నారు.

Pooja Hegde Movies : తాజాగా నెట్టింట బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు పదే పదే మారుమోగిపోతోంది. ఆమె గుంటూరు కారం నుంచి తప్పుకున్నట్లు వస్తున్న రూమర్సే దీనికి కారణం. ఒకప్పుడు తెలుగులో రెండు మూడు సినిమాలతో బిజీ బిజీగా కనిపించే ఈ చిన్నది.. ఉన్నట్టుండి ఖాళీ అయ్యింది. మహేశ్‌ సినిమా 'గుంటూరు కారం'లో ఓ కథానాయికగా ఎంపికైనప్పటికీ, ఈ మధ్య జరిగిన మార్పు చేర్పులతో ఆమె తప్పుకోవల్సి వచ్చింది. దీంతో ఉన్న ఒక్క సినిమా పూజా చేజారిందే అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్న సమయంలో.. ఆమె, డబుల్‌ ధమాకాకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇద్దరు యువ హీరోలు చేస్తున్న సినిమాల్లో ఆమెకి కథానాయికగా అవకాశాలు దక్కినట్టు సమాచారం. ఈ క్రమంలో స్టార్​ హీరోస్​ దుల్కర్‌ సల్మాన్‌, సాయిధరమ్‌ తేజ్‌లతో ఆమె జోడీ కట్టే అవకాశాలున్నట్టు సినీ వర్గాల టాక్​. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. ఈ మూవీ మాత్రం కన్ఫార్మ్ అయితే ఇక టాలీవుడ్​లో బుట్టబొమ్మకు తిరుగులేని అభిమానులు అంటున్నారు.

Nabha Natesh Movies : 'ఇస్మార్ట్ శంకర్​' సినిమాతో క్రేజ్​ సంపాదించుకున్న నభా నటేశ్​ కూడా ఇప్పుడు సినిమాల్లో అంతంత మాత్రంగా కనిపిస్తోంది. టాలీవుడ్​లో అయితే ఈ చిన్నదాని జాడే కనిపించటం లేదు. అయితే తాజాగా రెండు కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ఈ అమ్మడి ప్రస్తావన వచ్చిందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం నభా నటేశ్‌ పేరును పరిశీలిస్తున్నారట. అంతే కాకుండా యంగ్​ హీరో నాగశౌర్యతోనూ ఆమె ఓ సినిమా కోసం జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఇద్దరు భామలు డబుల్‌ ధమాకాతో ఇండస్ట్రీలో సందడి చేయడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details