Mahesh babu Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. పూజ హెగ్డే, శ్రీలీల లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాక కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నాన్న వార్తలు హల్చల్ చేయగా.. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ సినిమా నుంచి బయటకి రానున్నారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Guntur Karam : గుంటూరు కారం నుంచి పూజా ఔట్!.. తమన్ బాటలోనేనా? - గుంటూరు కారం న్యూస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం'లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను నుంచి సంగీత దర్శకుడు తమన్ తప్పుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు బుట్టబొమ్మ పూాజా హెగ్డే కూడా తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే ?
తమన్ ప్లేస్‌లో మరో డైరెక్టర్..
Guntur Karam Music Director : ఇక ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తమన్ ప్లేస్‌లో అనిరుద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా రీప్లేస్ చేశారని కొందరు అంటే.. మరికొందరేమో జీవీ ప్రకాష్ కుమార్‌ను తీసుకున్నారంటూ నెట్టింట పోస్ట్ చేశారు. అయితే తమన్ ట్విట్టర్ వేదికగా రెండు పోస్ట్‌లు పెట్టారు. అందులో వలిచిన అరటిపండు ఫొటోను అప్లోడ్ చేసిన తమన్ "కడుపు మంటకు అరటిపండ్లు చాలా మంచివి" అన్న క్యాప్షన్ రాసుకొచ్చారు. మరో ట్వీట్లో "మా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్‌ను ఓపెన్ చేస్తున్నా వచ్చి తాగండి. కడుపు మంటకి మజ్జిగ చాలా మంచిది" అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి పెట్టారన్న విషయంపై క్లారిటీ లేదు.
ప్రొడ్యూసరేమో ఇలా..
Guntur Kaaram Producer : ఇంతటి గందరగోళం నడుమ అఫీషియల్ అప్డేట్ వస్తుందన్న తరుణంలో 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ధంబ్స్ అప్ అనే ఎమోజీ పెట్టారు. దీంతో ఆయన ఈ రూమర్స్‌కు కాస్త చెక్ పెట్టినట్టు అనిపించినప్పటికీ ఈ విషయం అధికారికంగా తెలిసేంతవరకు రూమర్స్ ఆగవంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు ఫ్యాన్సేమో ఈ రూమర్స్ నిజమైతే ఇక సినిమా సంక్రాంతికి రిలీజవ్వడం డౌటే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.