తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సూర్య-శివ మూవీ డిజిటల్‌ రైట్స్‌ అన్ని కోట్లా? - undefined

సూర్యకు సంబంధించిన ఓ కొత్త మూవీ డిజిటల్​ రైట్స్​ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు

surya-next-film-digital-rights-sold-for-huge-price
surya-next-film-digital-rights-sold-for-huge-price

By

Published : Oct 9, 2022, 9:06 AM IST

తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు సూర్య. ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ కూడా అలరిస్తుంటుంది. అయితే, గత కొంత కాలంగా ఆయన సరైన విజయాలను అందుకోలేదు. కరోనా సమయంలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్‌'లు మంచి టాక్‌నే తెచ్చుకున్నా, ఓటీటీలో విడుదలయ్యాయి. 'ఈటీ' బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. అయినా కూడా సూర్యకు ఉన్న క్రేజ్‌ తగ్గలేదని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సూర్యకు సంబంధించిన కొత్త సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు టాక్‌.

శివ దర్శకత్వంలో సూర్య ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయిందట. ఓ ప్రముఖ ఓటీటీ రూ.100కోట్లకు ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. వరుస విజయాలు లేకపోయినా కోలీవుడ్‌లో సూర్య క్రేజ్‌ బాగుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. మరోవైపు వెట్రిమారన్‌ దర్శకత్వంలోనూ సూర్య ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఇక 'విక్రమ్‌'లో రోలెక్స్‌ పాత్రలో సూర్య అదరగొట్టారు. క్లైమాక్స్‌లో కనిపించేది కొద్దిసేపే అయినా మెరుపులు మెరిపించారు.

For All Latest Updates

TAGGED:

surya

ABOUT THE AUTHOR

...view details