తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'SSMB 28 షూట్​కు బ్రేక్.. హాలీడేలో మహేశ్​!'.. క్లారిటీ ఇచ్చిన వంశీ - ఎస్​ఎస్​ఎంబీ 28 నిర్మాత నాగ వంశీ ట్వీట్​

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB 28 పై తాజాగా సోషల్ మీడియాలో ఓ రూమర్​ తెగ ట్రెండ్​ అవుతోంది. అయితే ఆ రూమర్​ నిజం కాదని ఆ సినిమా నిర్మాత ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

naga-vamsi-about-ssmb28-movie-shooting-brake-rumours
ssmb 28

By

Published : Apr 27, 2023, 2:30 PM IST

టాలీవుడ్​ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న సినిమా 'SSMB 28'. ఈ సూపర్‌ హిట్‌ కలయికలో వస్తోన్న మూడో సినిమా కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అభిమానులు ఇంతలా ఆసక్తి కనబరుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే ఇప్పుడు నెట్టింట ట్రెండ్​ అవుతోంది. ఈ క్రమంలో ఇటీవలే వచ్చిన ఓ రూమర్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అయితే మహేశ్‌, త్రివిక్రమ్‌ మధ్య ఏదో గొడవ జరగడం వల్ల ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయిందని సోషల్​ మీడియాలో విసృత ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఈ వార్తపై ఇదే వేదికలపై రకరకాల కామెంట్స్‌ కూడా వినిపించాయి. సినిమా వదిలేసి మహేశ్‌ బాబు సమ్మర్‌ వెకేషన్‌కు వెళ్లారని.. అందుకే కాస్త బ్రేక్‌ ఇచ్చారంటూ ఫ్యాన్స్‌ తెగ కామెంట్స్‌ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. దీంతో ఆ వార్తపై స్పందించిన 'SSMB 28' నిర్మాత నాగవంశీ.. ట్విట్టర్​ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అలాంటివేమీ లేదని తేల్చి చెప్పారు. సినిమా అప్డేట్​ కోసం ఫ్యాన్స్ వేచి ఉండాలని.. మీ కోసం మంచి అప్డేట్​ ఇస్తామని కోరారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ 'SSMB 28' సినిమాలో మహేశ్‌ బాబు సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. అంతే కాకుండా యంగ్​ బ్యూటీ శ్రీలీల కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మే 31న మహేశ్​ తండ్రి దివంగత నటుడు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ప్రకటించనున్నరనే టాక్‌ కూడా సోషల్​ మీడియాలో బాగా వినిపిస్తోంది.

పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు టాలీవుడ్​ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవలే రిలీజైన పోస్టర్​లో మహేశ్​ తన లుక్​తో ప్రేక్షకులకు షాక్​ ఇచ్చారు. దీం​తో ఈ సినిమా పై మహేశ్​ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అంటూ సూపర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details